Saturday, December 19, 2009

ఆంధ్రరాష్ట్రం


కోస్తా అన్న తెలుగు మాట, కోస్ట్‌ అన్న ఇంగ్లీషు మాట కూడ 'కోస్తా' అన్న బుడతగీచు (పోర్చుగీసు) భాష నుండి పుట్టేయని ఒక అనుమానం ఉంది. కోస్తా లేదా తీరాంధ్ర ఆంధ్ర ప్రదేశ్ లోని తీరప్రాంతము. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రధాన విభాగాలలో ఒకటి.
మిగతావి తెలంగాణా, రాయలసీమ. 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడే వరకూ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఇది అంతర్భాగంగా ఉండేది. 1947లో భారత స్వాతంత్ర్యం రావడానికి ముందు బ్రిటిష్ ఇండియాలోని మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండేవి. మొత్తము కోస్తా జిల్లాలు తొమ్మిది (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా, గుంటూరు, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాలు). బ్రిటీషు ప్రభుత్వము యొక్క పాలన కింద ఉన్న జిల్లాలు కనుక వీటిని సర్కారు జిల్లాలు అని, ఈ ప్రాంతాన్ని సర్కారు అనికూడా వ్యవహరిస్తారు. ఈ తొమ్మిది జిల్లాలూ 1000 కి.మీ. నిడివిగల బంగాళాఖాత తీరాన్ని ఆనుకొని ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని కోస్తా ప్రాంతం అంటారు. గోదావరి, కృష్ణా, పెన్నానదుల సాగరసంగమ స్థానాల్లో ఉన్న ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటిలోను మిక్కిలి సారవంతమైంది. వరి, చెరకు పంటలకు ప్రసిద్ధి గాంచినది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ముఖ్యప్రాంతాల్లో ఒకటి రాయలసీమ. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలు రాయలసీమ ప్రాంతంలోకి వస్తాయి. ఒకప్పుడు దత్తమండలం (సీడెడ్) గా పేరుబడ్డ ఈ ప్రాంతానికి 1928లో గాడిచర్ల హరిసర్వోత్తమ రావు "రాయలసీమ" అని పేరుపెట్టాడు. అప్పటి నుండి ఆ పేరే స్థిరపడింది.

1953 వరకు రాయలసీమ ప్రాంతం సంయుక్త మద్రాసు రాష్ట్రం లో భాగంగా ఉండేది. కోస్తా, రాయలసీమ నాయకులు జరిపిన అనేక సంవత్సరాల ఉద్యమం ఫలితంగా 1953లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. కోస్తా ప్రాంతంతో పోలిస్తే రాయలసీమ అభివృద్ధి పరంగా వెనుకబడి ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినపుడు రాయలసీమ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతంలోని కర్నూలును కొత్త రాష్ట్ర రాజధానిగా నిర్ణయించారు. అయితే మరో మూడేళ్ళలోనే విశాల ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడడంతో రాజధాని హైదరాబాదు కు మారింది.

ఆర్థిక పరిస్థితి

తక్కిన రాష్ట్రం వలెనే రాయలసీమ కూడా వ్యవసాయాధారితమైనది. రాయలసీమలో వర్షపాతం రాష్ట్ర సగటు వర్షపాతం కంటే తక్కువ. అనంతపురం జిల్లా దేశం మొత్తం మీద అతి తక్కువ వర్షపాతం గల జిల్లాల్లో రాజస్థాను లోని జైసల్మీరు తరువాత రెండో స్థానంలో ఉంది. వ్యవసాయాధార ఆర్థికపరిస్థితి గల ఈ ప్రాంత అభివృద్ధిలో ఇది అతిపెద్ద అవరోధం. రాయలసీమకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వాలు ఎన్నో పథకాలు రచించాయి. బ్రిటిషు వారు నిర్మించిన కర్నూలు కడప కాలువ తోపాటు, శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ, తెలుగుగంగ, హంద్రీ-నీవా సుజల స్రవంతి, గాలేరు-నగరి మొదలైన ప్రాజెక్టులు వీటిలో కొన్ని. అయితే పథకాలు ఎన్నున్నా వాటి అమలు విషయంలో జరుగుతున్న జాప్యం, వర్షాభావ పరిస్థితుల కారణంగా పథకాల అంచనాల మేరకు సాగునీరందని పరిస్థితి నెలకొంది.

రాయలసీమ సంస్కృతి

ప్రధాన వ్యాసం: రాయలసీమ సంస్కృతి

భౌగోళిక మార్పులు

స్వతంత్రానంతరం గుంటూరు జిల్లానుండి కొంత భాగాన్ని, కర్నూలు జిల్లా నుండి కొంత భాగాన్ని వేరు చేసి ప్రకాశం జిల్లాను ఏర్పరచినారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా మొత్తం కోస్తా ప్రాంతంలోనే చూపించబడుతున్నది.

పరిశ్రమలు

పంటలు

No comments:

Post a Comment